– సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ, మహానాడు: మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని మేం బలంగా నమ్ముతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే… మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్ లో మహిళలు ఒంటరిగా సవాళ్ళను అధిగమించేలా చేస్తుంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాం. మనమంతా కలిసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దాం.