జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి ఎన్నికలు జరపండి

– హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి
– కో ఆపరేటివ్ కమిషనర్ ని కోరిన జర్నలిస్టులు

హైదరాబాద్: జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ కు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సోసైటీస్ పి.ఉదయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు జరపకపోవడంతో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా నాన్ అలాటీ సభ్యులు తీవ్రంగా నష్టపోయారని విన్నవించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సోసైటిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. 4 నెలల లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోరగా కమీషనర్ సానుకూలంగా స్పందించారు.

అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యం అనేక ఇబ్బందులు పడుతూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జెసిహెచ్ఎస్ నాయకులు కోరారు .

కమిషనర్ ను కలిసిన వారిలో జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు బ్రహ్మండబేరి గోపరాజు ,భీమగాని మహేష్ గౌడ్, సునీత,గయాస్ పాషా,జి.రఘు,పి.సాగర్,పర్వీన్ ,ఎం.శ్రీనివాస్ , రామకృష్ణ ,కె.రాజు, విఘ్నేశ్వర్ రావు, మునిరాజు తదితరులు ఉన్నారు