– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. వీళ్ళ రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారు.. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదు… కేవలం రాజకీయ కక్ష్యతో పెట్టిన కేసు అది.. దేశంలో కొట్లాడుతున్న జాతీయ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఒక్కటిగా పనిచేస్తున్నాయి… కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు సిగ్గుచేటు.. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ వ్యాఖ్యల విషయంలో స్పందించాలి.. సిసోడియా బెయిల్, కేజ్రివాల్ అరెస్ట్ విషయంలో నిందితులకు మద్దతు పలికిన కాంగ్రెస్ కవిత బెయిల్ విషయంలో నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గం. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో కుమ్మక్కయ్యాయి .. సిద్ధాంతాలు గాలికి వదిలేసి రాష్ట్రంలో అంటకాగుతున్నాయి. రేవంత్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించకపోవడం చూస్తుంటే ఆ పార్టీకి రేవంత్ తో సంబంధాలు ఉన్నయా ? లేవా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.