Mahanaadu-Logo-PNG-Large

కాంగ్రెస్‌ వసూల్‌ హామీ అమలవుతోంది

దేశవ్యాప్తంగా ఎన్నికలకు హైకమాండ్‌కు డబ్బు
అవినీతితో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయి
కేంద్రంపై రేవంత్‌ వ్యాఖ్యలు అర్థరహితం
తెలంగాణలో 10కి పైగా సీట్లలో గెలవబోతున్నాం..
ఈసారి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం

హైదరాబాద్‌, మహానాడు : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన జన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు దాదాపు 200 సీట్లలో విజయం సాధించనున్నాయి. నాలుగో దశలో మరింత భారీ విజయాన్ని సాధించనున్నాం. కచ్చితంగా 400 సీట్లు సాధిస్తాం. జూన్‌ 4 ఫలితాల్లో దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు బీజేపీ గెలువబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలువబోతున్నాం. 13 సీట్లలో పరిస్థితి చాలా సంతృప్తిక రంగా ఉంది. ఓ వైపు ఇండి కూటమి.. రెండోవైపు ఎన్డీయే కూటమి. ఓ వైపు రూ.12 లక్షల కోట్ల అవినీతికి కూటమి, మరోవైపు 25 పైసల అవినీతి కూడా లేని మోదీ కూట మి. అధికార అహం కారం తలకెక్కిన ఇండికూటమి, 23 ఏళ్లుగా సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ కూటమి ఉంది. ఈ పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆర్ధిక వ్యవస్థ, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ వంటి వాటిలో గణనీయమైన ప్రగతిని సాధించాం.

అవినీతితో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయి..

20 సార్లు లాంచ్‌ చేసినా రాహుల్‌ లాంచింగ్‌ను కాంగ్రెస్‌ విజయవంతంగా చేపట్టలేక పోతోంది. 21వ సారి కూడా అదే విఫల ప్రయత్నం దిశగా వారు పనిచేస్తున్నారు. 2014లో తెలంగాణలో రెవెన్యూ సర్‌ ప్లస్‌ ఉండిరది. కానీ ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిరది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు లభిస్తే.. ఇవాళ ఒక్క తెలంగాణకే రూ.60 వేల కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా లభిస్తోంది.
మౌలికవసతులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల కోసం స్వాతంత్య్రం వచ్చిన ప్పటి నుంచి 2014 వరకు వచ్చిన నిధుల కంటే ఈ పదేళ్లలో రెట్టింపు నిధులు మోదీ ఇచ్చారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. బీజేపీని గెలిపించడానికి సిద్ధమ య్యారు.

ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం…

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎవరు అధికారంలో ఉన్నా నడిపేది మజ్లిస్‌ పార్టీయే. తెలంగాణలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు..ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమే. మేం రాగా నే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.

వసూల్‌ హామీ అమలవుతోంది…

కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలులో విఫలమైంది. రూ.2 లక్షల రుణమాఫీని సోనియా జన్మదినం రోజు చేస్తామన్నారు. సోనియా ఎన్నవ పుట్టినరోజు అనేది చెప్పలేదు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా అన్నారు. అది కూడా చేయలేదు. క్వింటాపై ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదు. మహిళలకు రూ.2500 చేయలేదు. కానీ, హైకమాండ్‌కు ఇచ్చిన ఒక్క హామీని మాత్రం పూర్తిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారు.

దేశాన్ని ముక్కలు చేయలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది..

కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌, కూటమి నాయకుడు ఫారూఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేం రిజర్వేషన్లను తొలగిస్తామని దుష్ప్రచారం చేసింది. నా వీడియోను తప్పుగా ఎడిటిం గ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. 370 రద్దు చేస్తామంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ట్రిపుల్‌ తలాక్‌ తొలగిస్తామంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. పర్సనల్‌ లాను వినియోగంలోకి తెస్తామంటున్నారు. ఇలాంటివి అవసరమా? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. 2047 నాటికి దేశం అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయ త్నిస్తున్నారు. మరోవైపు దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. మోదీ ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మొదటి మూడు దశల్లాగా నాలుగో దశలో నూ బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నాను. మోదీ వచ్చే టర్మ్‌ను పూర్తి చేస్తారు. దీనిపై బీజేపీలో ఎలాంటి అనుమానాలు లేవు. ఇదంతా విపక్షాల కుట్ర.

92 శాతం హామీలు అమలు చేశాం..

మేము 13 కోట్ల మందికి టాయిలెట్లు ఇచ్చాం. 14 కోట్ల ఇళ్లకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం..దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చాం. మూడో టర్మ్‌లో కచ్చితంగా 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం. రామమందిరం ఇస్తామన్నాం ఇచ్చాం. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం. చెప్పిన చాలా విషయాలు చేశాం. 92 శాతం హామీల ను అమలు చేసి ఎన్నికలకు వచ్చాం.

రేవంత్‌ వ్యాఖ్యలు అర్థరహితం

మన సరిహద్దులు, దేశ అంతర్గత విషయంలో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోం. వారి భూభాగంలోకి చొచ్చి మరీ దాడిచేస్తాం. తెలంగాణలో పెట్టుబ డులు లేకుండా కేంద్రం కుట్ర చేస్తోందన్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ రాష్ట్రానికి రావడం లేదు. కావాలంటే ప్రధానమంత్రిని కలిసి అడిగితే బాగుంటుంది. అనవసర విమర్శలు సరికాదు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమ యం ఇచ్చింది. బెయిల్‌ రావడమే క్లీన్‌ చిట్‌ అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు.

ఎండోమెంట్‌ చట్టం తొలగింపు అంశం కోర్టులో ఉంది…

ప్రాంతీయ పార్టీలు తమ వాణిని చెప్పే అధికారం ఉంది. కేసీఆర్‌కు ఆ అధికారం ఉంది. అంతే తప్ప బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఎండోమెంట్‌ చట్టం తొలగింపు అంశం కోర్టు ముందుంది. కోర్టు ఏం చెబితే అదే చేస్తాం. బీజేపీ మూడిరట రెండొంతుల మెజారిటీ పదేళ్లుగా ఉంది. మేం ఆ పని చేయాలనుకుంటే ఎప్పుడే చేసే వాళ్లం. మాకు ఆ ఉద్దేశం లేదు. మేం ఆ మెజారిటీని ఆర్టికల్‌ 370ను రద్దుచేసేందుకు వాడాం. మతపరమైన రిజర్వేషన్లు అసాధ్యం, రాజ్యాంగ విరుద్ధం. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వే షన్లలోకి అందరూ వస్తారు. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజన చేస్తోంది. ఇప్పటికే దేశాన్ని ఓసారి విడగొట్టారు. వారికి అంతకన్నా ఇంకేం వచ్చు అని వ్యాఖ్యానించారు.