ప్రజా మద్దతు కాంగ్రెస్‌ కే ఉంది

-విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. కాంగ్రెస్‌ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇది కార్యకర్తల విజయం. వారి శ్రమ, కష్టం పార్టీ గుర్తిస్తుందన్నారు. రేపటితో ఎన్నికల కోడ్‌ ముగుస్తోంది. మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుత మైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా పాలన ఉంటుందని పేర్కొన్నారు. కాగా రేవంత్‌ను ఆయన నివాసంలో కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ ఆయనను అభినందించారు.