అన్న క్యాంటీన్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం

– నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, మహానాడు: అన్న క్యాంటీన్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన 11 నోడల్ ఆఫీసర్లను, 11 పరిశీలన ఆఫీసర్లు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. వసతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే సంబంధిత శాఖలకు తెలియపరచాలని, సమస్యను తెలిపిన వెంటనే ఆయా శాఖాధిపతులు 15 నిమిషాల్లో పరిష్కరించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఆహారంలో నాణ్యత, ఇస్తున్న టోకెన్లు, క్యాంటీన్‌లలో ప్రజలకు కల్పించిన సదుపాయాలను గమనించాలని, సమస్యలు ఉంటే వెంటనే తెలియపరచాలన్నారు.