37 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం: ఎమ్మెల్యే మాధవి 

గుంటూరు, మహానాడు: నల్లచెరువులో 37లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ నల్లచెరువు 2వ లైన్లో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.