‘దర్శి’ అభివృద్ధికి నిరంతర కృషి

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

తాళ్లూరు, మహానాడు: వందరోజుల కూటమి పాలనలో ప్రజల ఎంత సంతృప్తిగా ఉన్నారు? ఏ ఏ పథకాలు మీకందుతున్నాయి? వ్యవసాయ పంటలు ఎలా ఉన్నాయి? తాళ్లూరులో మౌలిక సదుపాయాలు కల్పన వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ లక్ష్మి తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వరుణ దేవుడు కూడా కరుణించాడని ఈ ఏడాది వ్యవసాయంపై కూడా ఆశలు పెట్టుకున్నామని వివరించారు. డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, యువతకు స్ఫూర్తి ప్రదాత, భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి, విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ సారథ్యంలో సంక్షోభం నుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా ఇచ్చిన మాట ప్రకారం అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు జీవం పోయడం… కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళుతోందన్నారు. జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ గారైన మాగుంట శ్రీనివాస్ రెడ్డి సహకారంతో దర్శి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు తాగునీటి వ్యవస్థలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని, వలసలు నివారించే లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రయత్నంలో భాగంగా ఇటీవల దర్శిలో జాబ్ మేళాను నిర్వహించి 587 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగామన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, దర్శిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఐదు వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించి, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మెడికల్ క్యాప్ ప్రతినెల ఒక మండలంలో నిర్వహిస్తామని ప్రకటించారు. తొలిసారి అక్టోబర్ ఆదో తేదీ దొనకొండలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.