పేదవారి దరికి కార్పొరేట్ వైద్యం

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గానికి చెందిన అర్హలైన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరుగురు లబ్ధిదారులకు రూ. 5,90,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందని తెలిపారు.