కోటప్పకొండ ఆలయ హుండీల లెక్కింపు

121 రోజులకు రూ.81,72,791

నరసరావుపేట, మహానాడు:  రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలసిన త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎన్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సింగరుట్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, కార్యనిర్వహణాధికారి,  సిహెచ్.శివనాగిరెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది.

వివిధ హుండీల ద్వారా రూ.76,63,351/- , అన్నదానం హుండీ ద్వారా రూ.5,09,440/- మొత్తం రూ.81,72,791/- (125 రోజులకు) లు వచ్చినట్లు సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి, ఎన్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో కెనరా బ్యాంక్, తంగేడుమల్లి బ్యాంక్ మేనేజరు, సిబ్బంది, దేవస్థానం పర్యవేక్షకులు చల్లా శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు. వెండి 696 గ్రాములు, బంగారం 36 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, విదేశీ కరెన్సీ 105 అమెరికన్ డాలర్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు మరియు 100 పౌండ్లు సుడాన్ దేశానికి చెందిన కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు.