Mahanaadu-Logo-PNG-Large

సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ బృందం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం సీపీఐ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందం జరిగినప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది స్థానాలను మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపారు. కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఈటీ నరసింహారావు తదితరులు ఉన్నారు.