బెంగళూరు: టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు.. తన స్నేహితురాలు శృతి రంగనాథన్ ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.