సీఎస్‌ జవహర్‌రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి

ఏపీలో రాజారెడ్డి రాజ్యం కొనసాగుతోంది
ఓడిపోతామని తెలిసి లండన్‌ వెళ్లి కుట్రలు
సినీ నిర్మాత నట్టికుమార్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్రంలో పరిస్థితులపై సినీ నిర్మాత నట్టికుమార్‌ స్పందించారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌ శిష్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడుతుంటే ఎన్నికల సిబ్బంది, ఈసీ, పోలీసులు పట్టించుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే తప్ప చర్యలు తీసుకోలేదు. వైసీపీ వారే అరాచకాలు చేస్తారు..మళ్లీ రీపోలింగ్‌ కావాలంటారు. రాజారెడ్డి అరాచక రాజ్యం జగన్‌ హయాంలో పెచ్చురిల్లుతోందని తెలిపారు. ఓడిపోతామ ని తెలిసి జగన్‌ లండన్‌ వెళ్లి ఇదంతా చేస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్‌ కూడా జగన్‌ ఇలానే చేసి సైకోలా ఆనందం పొందాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లి.. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయని, కొందరు పోలీసులు పిన్నెల్లికి తొత్తులుగా వ్యవహరి స్తున్నారని పేర్కొన్నారు.