Mahanaadu-Logo-PNG-Large

దైవం మానుష రూపేణ ఎన్టీఆర్

100 సంవత్సరాల క్రితం..

1923 మే 28 సోమవారం ….దైవం…. మానవ రూపంలో ఈ భువిపై వెలసిన….. సుదినం అది…..పురాణ పురుషుడు…… శ్రీకృష్ణ జననం…. కృష్ణాష్టమి… పర్వదినం ఎలాగో తెలుగు వారికి ఈరోజు అంతే
ఇది తెలుగు జాతికి పండుగ రోజు.. తెలుగు నాట ప్రతి ఇంట తేదీ మరువని….. రోజు ఇది

ఎప్పుడా ఎప్పుడా అని…. ప్రతి అభిమాని ఎదురుచూసే మహానాడు….
రానే వచ్చింది
అదే అదే ప్రతి రోజూ…ప్రతి క్షణం…ప్రతి తెలుగు వాడి… గుండెల్లో… గూడుకట్టుకుని…. కొట్టుకునే … శబ్దం… ఎన్టీఆర్ …..శత వసంతాల పుట్టినరోజు నేడేఈ భువి పై లేని వారి పుట్టినరోజు ని “జయంతి”….అనటం సహజం…..
ఈ భువిపై మనల్ని మైమరిపించి….దివిజనుల కోరిక మేరకు…. కొన్ని నాళ్ళు దైవ లోకంలో కూడా …తన నట ప్రదర్శనకు పయనమై వెళ్ళిన… మరణం.. లేని మహా నటుడు… ఎన్టీఆర్ .అసలు మరణమే లేని ఆ జననానికి… జయంతి అనటం సరి కాదు…. కనుక నేడు ఆయన జన్మదినమే ….ఈ శతాబ్దమే కాదు…. ముందు ముందు ఇంకా ఎన్నో…యుగ యుగాలు…. కొలిచే….ఈ భూమిని తాకిన మరుపు రాని ఆ సుందర రూపం…. ఖచ్చితంగా పురాణ పురుషుడిదే…..
నూటికో కోటికో ఒక్కడే పుడతారు అంటారు
నూటికో కోటికో కాదు
నూరు జన్మలు ఎత్తినా
నీలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని …. ఈ భువి పై చూడలేము
ఒక జన్మలోనే….వంద జన్మల సరిపడా … ఘనకార్యాలు సాధించిన ఘనుడు … దేముడు కాక పోతే ఇంకెవరు?
నీ నామ స్మరణే… మాకు శ్లోకం
నీ భజనే మాకు భక్తి గీతం
నీ పాద ముద్రలు తాకిన ఈ నేల మాకు పుణ్యక్షేత్రం
ఇంటింట ఆత్మ బంధువు అయిన మీకు జన్మదిన శుభాకాంక్షలు….. రామన్న
అంతిమంగా
దైవం మానుష రూపేణ ఎన్టీఆర్……..

– దారపనేని నరేంద్రబాబు
(టీడీపీ మీడియా కో ఆర్డినేటర్