పిడుగులపై ‘దామిని’ యాప్ ముందస్తు హెచ్చరికలు

న్యూఢిల్లీ: పిడుగులను ముందుగానే గుర్తించి, హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘దామిని లైటింగ్ అలెర్ట్’ అనే పేరుతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ మొబైల్లో ఈ యాప్ ఉన్నట్టయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను 2020లో కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ (ఐఐటీఎం) రూపొందించింది.