-టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
-కురిచేడు మండలంలో ప్రచారం
దర్శి, మహానాడు: కురిచేడు మండలం రామాంజనేయ కాలనీ, నాంచార పురం, మునియ్య కాలనీ, ముష్టగంగ వరం గ్రామాలలో సోమవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తు న్నారంటే ఐదేళ్ల పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వనందుకు ఓటేయాలా? సాగునీరు ఇవ్వక బీడు భూములుగా చేసినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు.
దర్శి అభివృద్ధి బాధ్యత తీసుకుంటాను…నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. సాగు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తానని వివరించారు. కాగా ప్రచారంలో పెద్దఎత్తున మహిళలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంటి శ్రీనివాసులరెడ్డిని గెలిపించా లని కోరారు. ఈ ప్రచారంలో మండల టీడీపీ అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, కూటమి నాయకులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.