హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు తెలంగాణ నేత దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశ్నించే గొంతుకగా, పీడిత తాడిత వర్గాల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేశారని, పోటీ చేసిన ప్రతి స్థానంలో ప్రజల అత్యంత అదరణతో 100 శాతం సీట్లు గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భు తంగా అభివృద్ధి చెందాలని, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని మరిం త బలోపేతం చేస్తారని ఆశిస్తూ, ఆదిదేవుడు మరింత శక్తి ప్రసాదించాలని, మరిన్ని రాజకీయ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రార్థించారు.