Mahanaadu-Logo-PNG-Large

సింగ్ నగర్ లో మృతదేహం!

విజయవాడ, మహానాడు: నగరంలోని సింగ్ నగర్ పైపుల్ రోడ్డు పక్క సందులో ఏ వన్ టీ స్టాల్ వద్ద మృతదేహం పడివుంది. మూడు రోజులుగా మృతదేహం నుండి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెంది ఉండొచ్చని, అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని స్థానికికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.