హైడ్రా పేరుతో కూల్చివేతలు సమంజసం కాదు

– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, మహానాడు: ప్రజలు హైడ్రా వల్ల భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్ మౌలాలి డివిజన్లలో తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ శేఖర రెడ్డి పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించారు. హైడ్రా అధికారులు ఎప్పుడొచ్చి కూల్చేస్తారో తెలియక శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్ ఎన్ .ఏం.డి.సి కాలనీ శివానంద నగర్, తదితర కాలనీల ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏమన్నారంటే… గత .30 సంవత్సరాల నుండి ఇండ్లు నిర్మించుకుని, మున్సిపల్ పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లు అన్ని విధాల పన్నులు కడుతున్నప్పటి హైడ్రా పేరుతో కూల్చివేయడం సమంజసం కాదు. ప్రజల పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాటం చేస్తా, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెల్తాం. ఒక్క ఇల్లును కూలనివ్వనని అన్నారు. ఈ సమస్య ఏ ఒక్కరిదీ కాదని, మొత్తం మల్కాజిగిరి ప్రజల సమస్య అని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసి అనవసర కార్యక్రమాలు చేస్తోంది. ఆరు గ్యారంటీ లను అటక ఎక్కించి దృష్టి మలచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రజలకు అండగా ఉంటా. ఎటువంటి ఆందోళనకు గురికావొద్దు. ప్రజలు భయాందోళన తో నిద్ర లేని రాత్రులు గడుపుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజా క్షేమం కోసం పని చేయాలి. అలా కాకుండా వారిని ఆవేదనకు గురి వారి సంక్షేమాన్ని, శ్రేయస్సును కాల రాయడం భావ్యం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇల్లు కట్టుకొన్ని అన్ని అనుమతులు తీసుకొని నిర్మించుకున్న ఇల్లని ఒక్కసారిగా నేలమట్టం చేయడం దుర్మార్గం. ప్రజలు పడుతున్న అవస్థలు, మానసిక క్షోభను చూసి చాల భాద కలిగింది. వారందరికీ అండ గా ఉంటా అని తెలిపారు.