అమరావతి: ఓటమి భయంతో వైసీపీ నేతలు నరరూప రాక్షసులుగా మారారని టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమన్నారు గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.