Mahanaadu-Logo-PNG-Large

లబ్ధిదారులకు రూ.14 వేల కోట్లు జమ చేయండి

ప్రభుత్వానికి అమరావతి బహుజన ఐకాస వినతి

అమరావతి, మహానాడు : ఎన్నికల నిబంధనలను పురస్కరించుకుని ఎలక్షన్‌ కమిషన్‌ అభ్యంతరాలు నేపథ్యంలో ఆగిపోయిన రూ.14 వేల కోట్ల పైనే నగదును ప్రభుత్వం వెంటనే నవరత్నాల లబ్ధిదా రులకు జమ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముఖ్యమంత్రి జగన్‌ ఆరుసార్లు బటన్‌ నొక్కారని, వైఎస్‌ఆర్‌ రైతు సబ్సిడీ, వైఎస్‌ఆర్‌ ఆసరా, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు రూ.14 వేల కోట్ల పైనే అందాల్సి ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో ఈ మొత్తం డబ్బుల విడుదల ఆగిపోయాయిందని తెలిపారు. ఎన్నికలు ముగిసినందున లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. ఈ డబ్బులను వైసీపీ కాంట్రాక్టర్లకు బిల్లుల రూపేణా అందజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చొరవ తీసుకుని జమ చేయా లని కోరారు.