సత్తెనపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ జన్మదిన వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.