Mahanaadu-Logo-PNG-Large

జగన్‌రెడ్డి ‘ప్లాన్‌ బీ’ స్కెచ్‌తో విధ్వంసం

పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని ప్లాన్‌
ఫ్రస్టేషన్‌లో టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు
రాక్షస పాలనను తరిమికొట్టడానికి కదిలివచ్చిన ప్రజలు
రాష్ట్రంలో పెనుమార్పునకు నాంది భారీ పోలింగ్‌ శాతం
వైసీపీ నేతల విధ్వంసంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం
టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని

మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, శ్రీకృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వం సం సృష్టించి ఓటర్లు బూత్‌లకు రాకుండా చేసి గెలవాలని జగన్‌ రెడ్డి ప్లాన్‌ చేశాడని కానీ ప్రజలు రాక్షస పాలనను తరిమికొట్టడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ఓడిపోతున్నా మన్న ఫ్రస్టేషన్‌లో వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు.

ప్లాన్‌ బీ విధ్వంసానికి తెర

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్‌కు ఓడిపోతున్నానని అర్థం అయింది. అందుకే ఫ్రస్టేషన్‌లో ప్లాన్‌ బీ ప్రవేశపెట్టాడు. పోలింగ్‌ బూత్‌లలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. విధ్వంసం సృష్టిస్తున్న పిన్నెల్లి సోదరులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. కర్రలు, రాడ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దారుణం. వైసీపీ నేతలకు జీ హుజూర్‌ అనడం పోలీసు వ్యవస్థకే అవమానం. చెవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుని దుర్మార్గానికి తెరలేపారు. పులవర్తి నానిని చంపడానికి ప్రయత్నం చేశారు. పేరు మాత్రమే పెద్దారెడ్డి..అతను బుద్ధిలేని రెడ్డి. డీఎస్పీ చైతన్య రాష్ట్రంలోనే పనికిమాలిన పోలీసు ఆఫీసర్‌. అరాచకం చేస్తున్న పెద్దారెడ్డి చుట్టూ ఎస్కార్ట్‌లా తిరుగుతున్నాడు. విధ్వంసం చేస్తుంటే మెడపట్టి స్టేషన్‌లో వేయకుండా కాపలా కాయడం దారుణం. 25 నియోజకవర్గాల్లో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించా రు. 119 సంఘటనలు జరిగాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. మాచర్ల కు వెళ్లి టీడీపీ నేతలకు భరోసా కల్పిస్తాం. ఇంకా కొంతమంది పోలీసులు జగన్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు తీరు మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

జైలుకు పోవడం ఖాయమని లండన్‌ పోతున్నాడు

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ జగన్‌ రెడ్డి ఓడిపోతే శాశ్వతంగా జైలుకు పోవడం ఖాయమని భయపడుతున్నాడు. అందుకే టీడీపీకి ఓట్లు వేసిన గ్రామాలు, టీడీపీ కోసం పనిచేసిన వారిని టార్గెట్‌ చేశారు. మాచర్లలో జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ముందుగానే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ నుంచి గూండాలు రౌడీలను తీసుకువచ్చి కారంపూడిలో 3 గంటల పాటు బీభత్సం సృష్టించారు. పిన్నెల్లి సోదరుడు వెంకట రామిరెడ్డి దీనికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులపర్తి నానిపై హత్యాయత్నం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జగన్‌ రెడ్డికి జైలు గుర్తుకు వస్తుంది. లండన్‌ పారిపోవడానికి సిద్ధం అయ్యాడు. అక్కడ కూర్చుని రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. గతంలో కూడా లండన్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్‌ చేయించాడు. దీన్ని ప్రజలు గమనించాలి. సీఎస్‌ జవహర్‌ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. నాలుగు నెలల ముందు బటన్‌ నొక్కి ఎన్నికల ముందు డబ్బు విడుదల చేయాలని నానాయాగీ చేశారు. ఎన్నికల తరువాత విడుదల చేయకుండా వారి కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు దండుకోవాలని చూస్తున్నారు. అధికా రులు అప్రమత్తంగా ఉండాలని, జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని గుర్తుపెట్టు కోవాలని సూచించారు.

సజ్జల డైరెక్షన్‌లో విధ్వంసకాండ

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సజ్జల డైరెక్షన్‌లో రాష్ట్రంలో విధ్వంస కాండ జరిగింది. పవిత్రమైన తిరుపతిలో పులవర్తి నానిపై హత్యాయత్నం చేశా రు. గన్‌మెన్‌ కాపాడకుంటే పులవర్తి నేడు ప్రాణాలతో ఉండేవారు కాదు. సమస్యాత్మక ప్రాంతాలు అని తెలిసినా ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తీసేసిన కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తాడేపల్లి కొంపలో కూర్చుని ఆంజనే యులు, రానాలాంటి అధికారులు సజ్జల, జగన్‌ రెడ్డిల డైరెక్షన్‌లలో అమాయకులైన కార్యకర్తలను బలిచేస్తున్నారు. చెవిరెడ్డి ఒంగోలులో కూర్చుని కొడుకుతో పులవర్తి నానిపై దాడిచేయించాడు. పోలీసులను సమస్యాత్మక ప్రాంతాలకు పంపించి ఇటువంటి అరా చక ఘటనలు జరగకుండా నియంత్రించాలి. ఈ ఘటనలపై గవర్నర్‌ కలిసి ఫిర్యాదు చేస్తాం. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని తెలిపారు.

పోలీసుల తీరు బాధాకరం

నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ దృష్టిసారిస్తుందని ప్రజలు భావించారు. అందుకోసం భారీగా ఓట్లు వేసి పోలింగ్‌ శాతాన్ని పెంచారు. కానీ అభివృద్ధితో పాటు వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సమస్యాత్మక నియోజకవర్గాలని ముందే గుర్తిం చారు. అందులో నాలుగు నియోజకవర్గాలు పల్నాడులో ఉన్నాయి. గత ఐదేళ్లు డీజీపీ అనే వ్యక్తి తన పదవిలో ఉన్నాడే కానీ పనిచేయలేదు. ఆ పని అంతా వైసీపీ సలహాదారు లే చేశారు. ఎస్పీ ఫోన్‌ చేసి చెప్పి నా కూడా కింద అధికారులు స్పందించడంలేదు. సీఐలు, ఎస్సైలు ఎవరూ పట్టించుకోలేదు. గురజాల నియోజకవర్గం మాదెన్నపాడులో వ్యక్తిని దారుణంగా చంపారు. ఇప్పటికైనా దాడులపై ఉక్కుపాదంతో అణిచివేయాలి. టీడీపీ నేతలు విధ్వంసానికి దూరంగా ఉండాలి.

అనిల్‌కుమార్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

బీసీ నేత జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ విధ్వంస రాజకీయానికి తెరలేపాడు. గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. జగన్‌ రెడ్డి అవినీతి అక్రమాలు, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. శాశ్వతంగా ముఖ్య మంత్రిగా ఉండాలన్న జగన్‌ కల కలగానే మిగిలిపోతుంది. పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. వైసీపీకి తొత్తులుగా మారి రాష్ట్రంలో రక్తపాతం జరుగుతున్న పట్టించుకోని పోలీసులను మార్చాలి. రాష్ట్రాన్ని అభివృధ్ధి బాటలో నడిపించుకోవాలి.