తెలుగుదేశానికి ముస్లిం సమాజం అండదండ
ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఏకపక్షంగా మద్దతు
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు సెక్యులరిజాన్ని కాపాడిన ఏకైక పార్టీ. ముస్లింలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకున్నారు. టీడీపీ ఏనాడూ మతపరమై న అంశాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అందుకే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోక ముందే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల తరుణంలో దాదాపు 17 ప్రాంతీయ, జాతీయ ముస్లిం సంఘాలు ఏకపక్షంగా టీడీపీకి మద్దతు ఇచ్చాయి. జగన్ రెడ్డి ముస్లింలకు చేస్తున్న అరాచకాలు చూసి తట్టుకోలేక టీడీపీ మేనిఫెస్టోలో ముస్లింలకు జరగబోతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించిన తర్వాత ఆల్ ఇండియా తన్జీయ్ ఏ ముఫ్తి యాన్ టీడీపీకి మద్దతు ప్రకటించింది. దియోబంద్ ప్రాంతం నుంచి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి నేరుగా వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు.
అదేవిధంగా దేశం లోనే ప్రఖ్యాతిగాంచిన జమాతుల్ ఉలేమా ఏ హింద్ సంస్థ జాతీయ అధ్యక్షులు సైతం ముస్లిం సమాజానికి చంద్రబాబు చేసిన ఉపకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముస్లిం సోదర, సోదరీమణులు ఏకపక్షంగా టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడిరచిన సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సంస్థ 2014లో ఏ విధంగా అయితే టీడీపీకి అండగా నిలిచా రో అదే విధంగా 2024 ఎన్నికల్లోనూ మద్దతు తెలియజేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెందటానికి కారణం ఒకరు నవాబ్ పీర్ ఉస్మాన్ అలీఖాన్ అయితే రెండో నవాబ్ నారా చంద్రబాబునాయుడు అని ప్రశంసించారు.
ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ మద్దతు
వైజాగ్‌లో మే 10న ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అందులో ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు ముఫ్తీ మహ్మద్ ఫారుఖ్ ఖాసిమి సైతం పాల్గొని చంద్రబాబుకు అండగా నిలు స్తామని ప్రకటించారు. గతంలో వైసీపీకి మద్దతు తెలిపి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశామని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యాఖ్యానించారు. తప్పును సరిదిద్దుకోవాలం టే ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుతో ముస్లింలు భుజంతో భుజం ఆణించి నడవాలని పిలుపునిచ్చారు. జగన్ అంటే మోసం, కక్ష, అబద్ధం. చంద్రబాబు అంటే దూరదృష్టి, అభివృద్ధి, సంక్షేమమని కొనియాడారు.
ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ మద్దతు
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చి సత్కరించిన చంద్రబాబుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు ఖారి నవీద్ కమాల్ ఖాదిరి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమ మేనిఫెస్టో చూసి ఆశ్చర్యపోయి చంద్రబాబుకే రాష్ట్ర ముస్లిం లు బాసటగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆఘమేఘాల మీద హైదరాబాద్ చేరుకుని చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. సహజంగా బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ముస్లింలు, ముస్లిం సంఘాలు దూరం కావడం సహజం. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు, పొత్తు పెట్టుకున్న తరువాత కూడా ముస్లిం సమాజం చంద్రబాబుపై ఎటువంటి తారతమ్యం చూపించలేదు. అంతటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చంద్రబాబు ముస్లింలలో పొందగలిగారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు మాత్రమే. కాబట్టి యావత్ ముస్లిం సమాజం ఏకపక్షంగా సైకిల్ గుర్తుపై ఓటువేసి సువర్ణాంధ్రప్రదేశ్ చరిత్రలో భాగస్వామ్యులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.