హైదరాబాద్ తరహాలో విజయవాడను అభివృద్ధి

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ స్థల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లక్ష్మీ పౌండేషన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శిబిరాన్ని ప్రారంభించి పరిశీలించారు. అక్కడి స్థల యజమానులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని నిజం నవాబులు నిర్మాణం చేస్తే సైబరాబాద్ అనే ప్రాంతాన్ని నారా చంద్రబాబునాయుడు నిర్మాణం చేశారని చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా అమరావతి రాజధానిని కూడా ప్రపంచ స్థాయిలో చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణం చేస్తారని అన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోడితో జరిగిన కలయికలో అనేక ప్రాజెక్టులు ఆమోదం పొందాయని చెప్పారు.

విజయవాడలో ఇప్పుడున్న ప్లైవోవర్ దగ్గర నుంచి నిడమానూరు వరకు ప్లైవోవర్ నిర్మాణం అయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లైవోవర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడ కార్పోరేషన్పై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశ్యంతో కార్పోరేషన్ జీతాలను 010 ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.

దీని ద్వారా సుమారు నెలకు రూ.18 కోట్ల భారం కార్పోరేషన్కు తగ్గిందన్నారు. చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా నిధులు తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానన్నారు. చంద్రబాబు నాయుడి మార్కు ఉండాలనే ఉద్దేశ్యంలో టవర్ లైన్ రోడ్డు నిర్మాణం చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, వంగల కృష్ణ ప్రసాద్, మురళీకృష్ణ, బాయన బాజ్జి, గద్దె రమేష్, తిరుమల విశ్వేశ్వరరావు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరాన్ని హైదరాబాద్ తరహాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.