తిరుమల కొండపై భక్తుల ప్రాణాలతో చెలగాటం

నీరు, ఆహారాన్ని పూర్తి అపరిశుభ్రంగా మార్చారు
అన్నప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు లేవు
తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు
కొండను మింగే ఆనకొండలు తయారయ్యాయి
హోటళ్లన్నీ వైసీపీ మాఫియా చేతిలో ఉన్నాయి
అధిక ధరలతో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్నారు
ఈవో, హెల్త్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మొద్దునిద్ర వీడాలి
కేంద్ర హోంశాఖ బయటపెట్టే వరకు ఏం చేస్తున్నారు
టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ధ్వజం

మంగళగిరి: తిరుమల కొండపై అన్న, పానీయాల్లో శుచి, శుభ్రత లేదని టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ జాతీయ కార్యా లయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ భక్తుల ఆరోగ్య, ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కొండలను మింగే అనకొండలు తయారయ్యాయి. జగన్‌ రెడ్డి అండ్‌ కో తిరుమల పవిత్రతను మంట గలుపుతున్నారు. దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. భక్తులకు సరఫరా చేస్తున్న నీరు, ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. కనీస ఆహార భద్రతా ప్రమా ణాలను పాటించడం లేదు. మొద్దునిద్ర పోతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, హెల్త్‌ ఆఫీసర్లు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ మొద్దు నిద్ర వీడాలి. కేంద్ర హోంశాఖ నియమిం చిన కమిటీ విషయాలను బయటపెట్టే వరకు టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. లక్షలాది మంది దేశవ్యాప్తంగా స్వామివారిని దర్శనం చేసుకు నేందుకు వస్తున్నారు. వీళ్లకు కనీసం నాణ్యమైన, శుభ్రమైన మంచినీరు, ఆహారం కూడా అందించలేని పరిస్థితిలో టీటీడీ ఉన్నదంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

జ్ఞానోదయం కలగదా?

తిరుమల కొండపైన భక్తులకు నీరు సరఫరా చేసే జలాశయాలు గోగర్భం, ఆకాశ గంగ, కుమార ధార, పసుపు ధార జలాశయాలను ఎన్నిసార్లు పరిశుభ్రం చేశారో తెలపాలి. ఈ నీటికి రక్షణ ఉందా, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారా అని కేంద్ర హోంశాఖ పరిశీలించే వరకు మీకు జ్ఞానోదయం కలగదా? 1968లో నిర్మించిన వాటర్‌ ఫిల్టర్‌ హౌసెస్‌ను ఆధునీకరించలేరా? కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారు కానీ, భక్తులకు నాణ్యమైన, శుభ్రమైన మంచినీరు అందించడానికి ఖర్చుపెట్టలేరా? టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. మరి భక్తులకు నాణ్యమైన నీరు అందించేందుకు రూ.4 కోట్లు ఖర్చుచేయలేని స్థితిలో టీటీడీ ఉంది. జీతాలు తీసుకోవడం, వీఐపీల సేవలో తరించడం తప్పించి సామా న్య భక్తుల సమస్యలను, కష్టాలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు.

ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో తాగునీటి మాఫియా

తిరుమల కొండపై ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో తాగునీటి మాఫియా కొనసాగుతోంది. ఒక నీటి సీసా రూ.60 అమ్ముకుని భక్తుల రక్తం పీలుస్తున్నారు. అడిగే నాథుడె వ్వరూ లేరు. అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయించే తిరుమల కొండపై ఏ హోటల్‌లోనూ ధరల పట్టిక కనిపించదు. హోటళ్లన్నీ వైసీపీ మాఫియా చేతుల్లో నడుస్తున్నాయి. నెలకు ఒక్కసారైనా ఆహార భద్రత అధికారులు, హెల్త్‌ ఆఫీసర్లు కానీ హోటళ్లను సందర్శించిన దాఖలాలు ఉన్నాయా? శాంపిళ్లు తీసుకుని ఏ రోజైనా పరీక్షశాలలకు పంపించి రిపోర్టులు తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉంటే వాటిని బహిర్గతం చేయగలరా? టీటీడీ పాలకమండలి సభ్యులు టికెట్లు అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ధ భక్తుల సౌకర్యాల గురించి పట్టించుకున్న సందర్భాలు ఉన్నాయా?

నాసిరకం అన్నప్రసాదంపై బుద్ధిరాలేదా?

చివరకు పవిత్రమైన అన్నదానంలో కూడా భక్తులకు ఇచ్చే తాగునీరు, అన్న ప్రసాదం నాణ్యతా ప్రమాణాలు లేవు. గతంలో అన్నదాన సత్రంలో నాసిరకం భోజనాల పెడుతున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేసినా, వీడియోలు వైరల్‌ చేసినా మీకు బుద్ధి రాదా? మార్కెటింగ్‌ శాఖ అధికారులు నాణ్యత లేని వస్తువుల ను కొనుగోలు చేయడం వల్లే అన్నదానంలో భోజనాలు, ప్రసాదాలు నాసిరకంగా ఉంటున్నాయి.

అద్దె గదులు దుర్గంధం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రంలో ఉన్న అద్దె గదులు దుర్గంధ భరితంగా ఉన్నాయి. సామాన్య భక్తులు ఉండేటువంటి అద్దె గదుల్లో కిటికీలు, బాత్రూం తలుపులు, ఫర్నిచర్‌ అన్నీ నాసిరకంగా ఉన్నాయి. వీఐపీ గదుల్లో మాత్రం స్టార్‌ హోటల్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ మాత్రానికే టీటీడీ ఈవోగా ఉన్న అర్హత లేని ధర్మారెడ్డికి ఎక్స్‌టెన్షన్‌లు, ఇన్‌చార్జ్‌లు? ఇవన్నీ స్వామివారు చూస్తు న్నారు. కొండపై జరుగుతున్న మీ దందాను ఏదో ఒకరోజు స్వామివారు తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు మేల్కొని భక్తులకు నాణ్య మైన మంచినీరు, ఆహారం అందించాలని, సామాన్యులు ఉండే గదుల్లో సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్యాన్ని కాపాడాలని, హోటళ్ల దోపిడీని అరికట్టాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, అన్నదాత సత్రాల్లో నాణ్యమైన అన్నప్రసాదం అం దించాలని డిమాండ్‌ చేశారు.