అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా?

బొమ్మలు పంచితే కడుపు నిండుతుందా?
ఆయన రాహుల్‌గాంధీ కాదు రాంగ్‌ గాంధీ
హుస్నాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో హరీష్‌రావు

హుస్నాబాద్‌, మహానాడు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో శుక్రవారం కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. వికాసం కావాలంటే వినోద్‌ అన్న గెలవాలి. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్‌, బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? పిల్లల జీవితాలు బాగవుతాయా? అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా? కాదు ట్రస్ట్‌ కట్టింది..ఆలయ నిర్మాణానికి నేనూ రూ.2 లక్షల విరాళం ఇచ్చాను. నిన్న హైదరా బాద్‌లో రాహుల్‌గాంధీ సభ తుస్సుమంది. కాంగ్రెస్‌ వాళ్లు ఓటు అడిగితే నెలకు రూ.2500 బాకీపడ్డారని, ఐదు నెలలకు 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పాలన్నారు. రేవంత్‌ రెడ్డి కంటే రాహుల్‌ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడని,. ఆయన రాహుల్‌ గాంధీ కాదు రాంగ్‌ గాంధీ అని మండిపడ్డారు.