నేడు ఏపీలో శాంతిభద్రతలపై చర్చాగోష్టి

విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో 2014-2024 మధ్య శాంతిభద్రతలు అన్న అంశంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ మొఘలరాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చాగోష్టి జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌, హైకోర్టు న్యాయవాది పడిరి రవితేజ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి, ఏపీ టుమారో అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, మాలమహానాడు అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, పాత్రికేయులు ఆలపాటి సురేష్‌, మాజీ శిశు సంక్షేమ శాఖాధికారి సుహాసిని తదితరులు పాల్గొననున్నారు. ఈ మేరకు టీమ్‌ స్వేచ్ఛ ప్రతినిధులు న్యాయవాది పిళ్లా యశ్విని, వ్యాపారవేత్త మొవ్వ సత్యప్రసాద్‌, సామాజిక కార్యకర్త పెద్ది యశస్విని ఒక ప్రకటనలో తెలిపారు.