చిరు వ్యాపార‌స్తుల‌కి తోపుడు బండ్లు పంపిణీ

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రు చిరు వ్యాపారుల‌కి గురువారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తోపుడు బండ్ల అంద‌జేశారు. 54వ డివిజ‌న్ వించిపేట లో నివ‌సించే ఎమ్.తిరుప‌త‌మ్మ‌, 51వ డివిజ‌న్ శ్రీనివాస‌మ‌హ‌ల్ సెంట‌ర్ కి చెందిన మావూరి వెంక‌ట్రావు ల‌కు కూర‌గాయ‌ల వ్యాపారం చేసుకునేందుకు ఈ తోపుడు బండ్లను ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్య‌క్షుడు సొలంకి రాజు స‌హ‌కారంతో ఎంపి కేశినేని శివ‌నాథ్ ల‌బ్ధిదారుల‌కి అందించారు.

. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ బ‌డుగు బ‌లహీన వ‌ర్గాలకు..పేద వారికి సాయం చేయ‌టంలో టిడిపి ముందుంటుంద‌న్నారు . తోపుడు బండ్లు అందుకున్న ఆ ఇద్ద‌రు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు కొగంటి రామారావు, గ‌న్నే నారాయ‌ణ ప్ర‌సాద్ (అన్న‌) , మాజీ కార్పొరేట‌ర్ ఎరుబోతు ర‌మ‌ణ‌, యేర్నెని వేద‌వ్యాస్, మాదిగాని గురునాథం,పొన్నం ర‌వి, ఆళ్ల మోహ‌న్ రావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.