పల్నాడు, మహానాడు: మహారాష్ట్ర లోని జలగాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన పథకం లఖ్ పతి దీదీ కార్యక్రమాన్ని పల్నాడు కలెక్టరేట్ లో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, పథక సంచాలకుడు బాలు నాయక్ తిలకించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు 5184 మందికి ప్రశంసా పత్రాలు, సీఐఎఫ్ రుణాలు రూ. 20 లక్షలు, బ్యాంక్ లింకేజీ రుణాలు రూ. 54 కోట్ల 14 లక్షల చెక్కులను వారు పంపిణీ చేశారు.