– వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు
విజయవాడ, మహానాడు: తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్ల తో పాటు అత్యవసర మందుల కిట్లను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలూ వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బంది నియామకం, అందుబాటులో సరిపడా మందులు, అత్యవసర మందుల కిట్‌లో ఆరు రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాల పంపిణీ, ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, రేయింబవళ్లూ సేవలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణబాబు ఆదేశించారు.