• మంత్రులు నారాయణ, సవిత వెల్లడి
• 54 డివిజన్ లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు
• వించిపేట ఉర్దూ పాఠశాలను శుభ్రం చేసిన నారాయణ, సవిత
విజయవాడ: శుక్రవారం నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు నారాయణ, సవిత వెల్లడించారు. గురువారం నగరంలోని 54 డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్, వించిపేట, ఈఫెన్ వారి స్ట్రీట్ లో పర్యటించారు. ముందుగా వించి పేటఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను మంత్రులు సంద్శరించారు. పాఠశాల శుభ్రం పనులను పర్యవేక్షించారు. అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా పరిశీలించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్, ఈఫెన్ వారి స్ట్రీట్ లో చేపట్టి పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు నారాయణ, సవిత మాట్లాడారు. విజయవాడలో 200 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణానది వరదలచొచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. భారీ వరదల కారణంగా చాలా చోట్ల బోట్లు, ట్రాకర్టు కూడా బోల్తాపడిన ఘటనలు న్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కలెక్టరేట్ ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు.
స్వయంగా ఆయన కూడా నగరంలో పర్యటిస్తున్నారన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా మంత్రులందరినీ వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం 80 శాతం ప్రాంతాల్లో వరద ముంపు నుంచి బయటపడ్డాయన్నారు. మరో 20 శాతం ప్రాంతాల్లో నీరు ఇంకా ఉందని, రేపో మాపో ఆ ప్రాంతాలు కూడా ముంపు నుంచి బయటపడతాయన్నారు. వరద నీరు తగ్గినా ఇప్పటికీ వరద బాధితులకు పాలు, పండ్లు, ఆహార పొట్లాలు, నీరు అందిస్తున్నామన్నారు.
బుధవారం ఒక్కరోజే వరద ప్రాంతాల్లో 26 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8 లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. అదే స్థాయిలో గురువారం కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. వరద కష్టాల నుంచి ప్రజలు గట్టెక్కే వరకు ఈ సరఫరా కొనసాగిస్తామన్నారు. శుక్రవారం నుంచి బియ్యం సహా పలు నిత్యావసరలు సరకులు పంపిణీ చేయనున్నట్లు నారాయణ తెలిపారు.
10 వేల మందితో పారిశుద్ధ్య పనులు : మంత్రి సవిత
విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో, పారిశుధ్యం మెరుగుకోసం ఇతర జిల్లాలకు చెందిన 10 వేల మంది పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇతర మున్సిపాల్టీలకు చెందిన కమిషనర్లకు కూడా డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారన్నారు. రాత్రి పగలు తేడాలేకుండా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలూ అందిస్తున్నామన్నారు.
ప్రతి సచివాయం పరిధిలోనూ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లను నియమించి, పారిశుధ్య పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. జరిగిన విపత్తు నుంచి ప్రజలు కోలుకునేలే చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. గాంధీ బొమ్మ సెంటర్ రోడ్డు నిర్మాణానికి గత పాలనలో అయిదు పర్యాయాలు శంకుస్థాపన చేసి పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు.
స్కూల్ ను శుభ్రం చేసిన మంత్రులు
వించి పేటలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఆవరణను మంత్రులు నారాయణ, సవిత ఫైర్ ఇంజన్ పైప్ తో శుభ్రం చేశారు. అక్కడి నుంచి గాంధీబొమ్మ సెంటర్, ఈఫెన్ వారి స్ట్రీట్ లో పారిశుధ్య పనులు పర్యవేక్షించారు. ఈఫెన్ వారి స్ట్రీట్ లో ఇళ్లకు వెళ్లి అక్కడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత.. అదే వీధిలో చీపురుతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.