గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులతో వెళ్ళే వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ… ఆపద సమయంలో చిన్నా,పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుభాని, మల్లె ఈశ్వరావు, అడక శ్రీనివాసరావు, వేముల కొండశ్రీను, ముత్తినేని రాజేష్, దామంచర్ల శ్రీనివాస్ రావు, మేళం సైదయ్య, తమ్మిశెట్టి రాంప్రసాద్, రాము, ఓర్చు శ్రీనివాసరావు, గుర్రం ప్రసాద్, మొవ్వ వేణుబాబు, తదితరులు పాల్గొన్నారు.