ప్రమాణస్వీకారం సందర్భంగా ఆంక్షలు
ఎస్పీ తుషార్ డూండి వెల్లడి
గుంటూరు: గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహన దారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి, గుంటూరు జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్ల గురించి ఎస్పీ తుషార్ డూండి వెల్లడిర చారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే హెవీ వాహనాలు, మధ్యతరహా రవాణా వాహనాలు హైవే పైకి అనుమతిం చబోమని వేరే మార్గంలోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
బుడంపాడు జంక్షన్: గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు జంక్షన్ వద్ద హైవే దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లవలెను.
`చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలు బుడంపాడు- తెనాలి -వేమూరు – వెల్లటూరు -పెనుమూడి-అవినిగడ్డ- పామర్రు-గుడివాడ -హనుమాన్ జంక్షన్ మీదుగా వైజాగ్ వెళ్లవలెను. చెన్నై వైపు నుంచి బాపట్ల, చీరాల వైపు వెళ్లే అన్ని వాహనాలు గుంటూరు ఏటుకూరు అండర్ పాస్ కింద నుంచి పత్తిపాడు- పర్చూరు- చీరాల- బాపట్ల నుంచి 216 నేషనల్ హైవే మీదుగా వెళ్లాల్సి ఉంది.
` హైదరాబాద్ వైపు వెళ్లు వాహనాల మళ్లింపు: గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పేరేచర్ల జంక్షన్ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లవలెను. విజయవాడ వైపు అనుమతించబడవు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరమెట్ల-అద్దంకి- పిడుగురాళ్ల మీదు గా హైదరాబాద్ వెళ్లవలెను. గుంటూరు నుంచి విజయవాడ వైపు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. చిలకలూరిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు చిలకలూరిపేట వై జంక్షన్(గుంటూరు) నుంచి చుట్టుగుంట, పేరేచర్ల మీదుగా వెళ్లాలని సూచించారు. అత్యవసర వాహనాలను ఏ దారి నుంచి అయినా అనుమతించనున్నట్లు తెలిపారు.