-ఈసారైనా ఇచ్చిన మాట నిలుపుకుంటారా?
-పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన
-ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో ఆగిన పనులు
-మూడు రాజధానులంటూ ప్రజలతో చెలగాటం
-ఐదేళ్లుగా భూములిచ్చిన రాజధాని రైతుల ఉద్యమం
-నిద్రాహారాలు మాని ప్రాణాలు అర్పించిన అమరులు
-వేధించి వందలాది కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం
-కూటమి గెలుపుతో మరోసారి రాజధానిపై ఆశలు
-మూడోసారి ఎన్నికైన తర్వాత తొలిసారి వస్తున్న ప్రధాని
-అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
-నిర్మాణాలకు సహకారం అందించాలని విన్నపాలు
-ఆగిపోయిన నిర్మాణాల పూర్తికి సహకరించాలని ఘోష
-చంద్రబాబు ప్రమాణస్వీకారంలో మోదీ ప్రకటనపైనే ఆశలు
-పదేళ్ల కల సాకారానికి ఎదురుచూపులు
(వాసిరెడ్డి రవిచంద్ర)
అమరావతి: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి ముఖ్యమంగా రాజధాని ప్రాంతానికి వస్తున్న మోదీకి అమరావతి రైతులు విన్నపాలు వినవలె అంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానిగా తుళ్లూరు ప్రాంతంలోని 18 గ్రామాల పరిధిలో 36 వేల ఎకరాల భూవిస్తీర్ణంలో రైతుల వద్ద స్వచ్ఛం దంగా భూములను సేకరించి అమరావతి రాజధాని ప్రకటించారు. అమరావతి రాజధాని పనుల నిర్మాణ శంకుస్థాపన అబ్బురాజుపాలెం గ్రామం వద్ద పదేళ్ల క్రితం మోదీ చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రోడ్లు భవనాలు, అంతర్గత డ్రైన్లు, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, సచివాలయ నిర్మాణం వంటి కొన్ని పనులు చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చకచకా చేయగలిగా రు. అయితే ఆ తర్వాత జగన్ రాగానే అమరావతి కేవలం శాసన రాజధానిగా మూడు రాజధానుల ఆట ప్రారంభించారు. దాంతో భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఐదేళ్ల పాటు నిరంతరాయం గా ఆయా గ్రామాల రైతుల రైతులం పోరాటం చేశారు. జగన్ ప్రభుత్వం వందలాది కేసులు పెట్టింది. రాజధానిని కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగారు. దేవాలయాల చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఇలా అమరావతి రాజధా నిగా ఉండాలని యజ్ఞం సాగించారు.
అమరావతి పూర్వవైభవానికి నిధులు కేటాయించాలి
కూటమి గెలుపుతో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు చేరడం మరో శుభం పరిణామంగా అమరావతి రైతులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, మోదీ కలయిక రాష్ట్ర అభివృద్ధికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్న మోదీకి తమ విన్నపాలు వినిపిస్తున్నారు. తిరిగి అమరావతి రాజధానిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అమరావతికి పూర్వవైభవానికి అవసరమైన నిధుల మంజూరుకు మోదీ హామీ ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఆగిన భవనాలను పూర్తిచేయాలని, రోడ్లను, డ్రైన్ నిర్మాణాలను పూర్తిచేయాలని వేడుకుంటున్నారు. రాజధానిని హైదరాబాదు వలె అభివృద్ధిలో పరుగులు తీయించాలని, అందుకు అవసరమైన నిధులకు కేంద్రం సహకరించే విధంగా ప్రధాని హామీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఎంతో త్యాగం చేసి తమ భూములు రాజధాని కోసం అప్పగించామని ఆ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ప్రజా రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరు కుంటు న్నారు. ఇందుకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నారు. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని స్పష్టమయ్యేలా అభివృ ద్ధి జరగాలని రైతాంగం విన్నవిస్తున్నారు. అంతేకాకుండా తమపై ఐదేళ్లుగా జగ న్ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రైతుల కలలకు సహకారం అందించేలా సభలో ఏమైనా ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచిచూడాలి.