బాబు-పవన్‌ లా జగన్‌ కు కుటుంబ బంధమేదీ?

-‘జగన’ంత కుటుంబం ఏదీ?
-బాధల్లో బాసటగా బాబు-పవన్ కుటుంబాలు
-జగన్‌కు తల్లీ-చెల్లీ దూరం

కుటుంబం.. బంధాలు
అనుబంధాలు, సంబంధాలు , ఉద్వేగం,
ఉత్కంఠ, సంతోషం, కళ్ళల్లో నీరు:-

మొదటిగా జగన్ రెడ్డి:
తండ్రి చనిపోయినప్పుడు, బాబాయి హత్య అప్పుడు కనపడని కన్నీరు, మొన్న జూన్ 4వ తారీఖున కనబడ్డాయి. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు గౌరవంగా పేరు పెట్టి పిలవని నోరు, “పవన్ కళ్యాణ్ గారు” అంటూ వగచింది.

నాకు అందులో భాధ కన్నా, ఘోర, అవమానకర పరాజయం తాలూకు ఉండేలు, కవుకు దెబ్బ తీవ్రత కనిపించింది తప్పితే, ఎక్కడా నిజాయితీ కనబడలేదు. పైగా తాను సోమ్ములు పంచిన జనాలు ఓట్లు వేయలేదనే నింద మోపాడు.

ఇకపోతే, అతని ఏడుపు పంచుకోవటానికి సొంత తల్లి, షెల్లి కూడా లేదు. వదిలేసి దూరంగా పారిపోయారు. పైగా అతని పరాజయం కోసం కూడా పిలుపు ఇచ్చారు.

ఒక్క బలమైన, ఘోరమైన ఓటమి, సింహం అని డప్పు వేసుకున్న వారిని కుదేసి కూలబెట్టి, వెక్కి వెక్కి ఏడ్వటం తప్పా, మిగిలినవి అన్ని చేయించింది.

(కానీ, 2019లో ఘోరమైన ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ , వెంటనే బయటకు వచ్చి ప్రజా తీర్పు స్వాగతించారు, చిరునవ్వుతో స్వీకరించి తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు. జగన్ రెడ్డి లా ఏడ్వలేదు)

చంద్రబాబు:
స్ధానిక సంస్థల ఎన్నికలలో జగన్ రెడ్డి అక్రమాలను, దౌర్జన్యాలను తట్టుకోలేక తప్పుకున్నా, జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తనను ఘోరంగా అవమానకరమైన, అసభ్యమైన, అసహ్యకరమైన భాషలో వేధించినా, చివరకు అరెస్టు చేసి జైలులో వేసినా, గుండె నిబ్బరంతో పవన్ కళ్యాణ్ అండతో నిలబడి, కలబడి తనెంటో నిరూపించు కున్నారు. అతని వెంట అయన కుటుంబ సభ్యులు బలంగా నిలబడ్డారు. చంద్రబాబు స్ధిత ప్రజ్ఞతకు అదోక మచ్చుతునక.

పవన్ కళ్యాణ్ :
2019 లో వచ్చిన ఘోర పరాజయం తరువాత దానిని హూందాగా, గౌరవంగా అహ్వానించి, నిలబడి, కలబడ్డారు. కరోనా సమయంలో అయన స్పూర్తితో జనసైనికులు చేసిన సహాయం అపూర్వం. తదనంతరం వచ్చిన స్ధానిక సంస్థల ఎన్నికలలో జనసైనికులు కలబడి, నిలబడిన తీరు, పవన్ కళ్యాణ్ మొండితనం, ప్రజలకు అండగా నిలబడే విధానం మొదటిసారిగా రాష్ట్ర ప్రజలను పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా ఆశీర్వదించటానికి దోహద పడింది.

ఇక అక్కడి నుంచి, 2024 ఎన్నికలు ముగిసే వరకు వెనక్కి తిరగలేదు, మడమ తిప్పలేదు. ఇప్పటం అవిర్భావ సభ ద్వారా.. వైకాపా వ్యతిరేక చీలనివ్వను అనే సంకల్పం, శపధంతో మొదలై, వారాహీ యాత్ర ద్వారా దానిని సార్ధకం చేసుకునే వరకు విశ్రమించలేదు.

విశాఖ పట్నం, ఇప్పటం, చంద్రబాబు అరెస్టు అనంతరం జగన్ రెడ్డి పోలీసులతో చేయించిన దాడులను ఎదురొడ్డి నిలబడ్డాడు. అయనకు అండగా జనసైనికులు నిలబడ్డారు. ఇవన్నీ అయనలో కసి మరింత పెంచాయి. ఎన్నో అవమానాలను దిగమింగి, తనను తాను తగ్గించుకోవటమే కాకుండా, తన పార్టీని కూడా తగ్గించుకొని తెదేపాతో ఏర్పాటు చేశాడు. సదరు కూటమి లోకి భాజపా ని విజయవంతంగా తెచ్చాడు.

ఇవన్నీ సునిశితంగా గమనించిన రాష్ట్ర ప్రజలు, పవన్ కళ్యాణ్ సంకల్పం అయన వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే దానికి సంపూర్ణంగా మధ్ధతు ఇచ్చి, మనసారా ఆశీర్వదించారు.
ఫలితం, 2019లో జగన్ రెడ్డికి 151 ఇచ్చిన రాష్ట్ర ప్రజలే, 2024 వచ్చేసరికి 11 మాత్రమే ఇచ్చారు. కూటమికి 164 సీట్లు ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన మరోక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ వెంట మెగా కుటుంబం మొత్తం అండగా నిలబడింది. చిరంజీవి పార్టీకి అర్ధిక సహయంతో, తన తమ్ముడి గెలుపు కోసం పిలుపు ఇచ్చారు. మెగా హీరోలు ప్రచారం చేశారు. నభూతో నభవిష్యతి అనే తీరులో జనసేన 21/21 మరియు 2/2 సీట్లతో 100% విజయం తో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు.

ఈ విజయంతో తన కుటుంబ సభ్యులను కలసిన పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇంటిలో లభించిన అపూర్వ స్వాగతం రాష్ట్రం మొత్తం వీక్షించింది. పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడిలా తన తల్లికి, అన్నా వదినలకు సాగిలపడి నమస్కారం చేసిన తీరు, రాష్ట్ర ప్రజలను ఉద్వేగంతో కదిలించింది.

చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ కళ్ళల్లో ఉద్వేగం, భావోద్రేకం తో నీరు తిరిగిన తీరు, వారి కుటుంబ బంధాలు, సంబంధాలు, అనుబంధాలు ప్రపంచానికి మరొక సారి పరిచయం చేసింది. పది సంవత్సరాల పవన్ కళ్యాణ్ కష్టం చూసి విలవిలలాడిన మనస్సులు, అయనను ప్రజలు అహ్వానించిన తీరు, ఆశీర్వదించిన తీరు, నమ్మిన తీరు కి మెగా కుటుంబం కదిలి పోయింది ఉద్వేగంతో

ముక్తాయింపు: కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు గారి కుటుంబం రాష్ట్ర ప్రజలకు చూపాయి. అలాగే, కుట్రలు, కుత్సితాలు, స్వార్ధపూరిత విధానాలకు నిలయమైన జగన్ రెడ్డి వెంట ఒక్కరంటే ఒక్క కుటుంబ సభ్యులు లేరు.

ఇప్పుడు చెప్పండి ప్రజలారా.. కుటుంబం అంటే ఎవరిది? బంధాలు, అనుబంధాలు అంటే ఏమిటీ? సొంత తల్లి, చెల్లిని అగౌరవమైన విధంగా చూసినవాడు, రాష్ట్ర మహిళలను నా అక్కా షెల్లెమ్మలు అంటే నమ్ముతారా? అంధ్రులు కుటుంబ విలువలు పాటించే వారిని ఎల్లప్పుడు ఆశీర్వదిస్తారు, లేని వారిని ఎలా తిరస్కరిస్తారో 2024 ఎన్నికల ఫలితాల ద్వారా చక్కగా నిరూపించారు. మీరేమంటారు ప్రజలారా?