దాతలు ముందుకు రావడం హర్షణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద గుంటూరు హోటల్స్ అసోసియేషన్ (హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్ధం విజయవాడకు పంపే నిత్యావసర సరుకుల వాహనాలను గురువారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ… ఆపద సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాల వారు, ప్రజలు ముందుకు రావటం హర్షణీయమని, వారిని అభినందిస్తునట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి, వారికి తోచిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, మౌర్య సుబ్రహ్మణ్యం, యనమదల సాంబశివరావు, పొనకళ్ల సుబ్రహ్మణ్యం, సింగంశెట్టి వీరయ్య, నున్న రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నుండి ప్రత్యక్ష విరాళాలు కోరుతున్నా
విజయవాడ ప్రజలకు అండగా సాటి మనిషి నిలబడాలనే సంకల్పంతో ప్రజల నుండి వివిధ రూపాల్లో విరాళాలు కోరుతున్నట్టు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, దుప్పట్లు వంటి వివిధ ఉపయోగకర వస్తువుల రూపంలో విరాళాలు అందించి తమ ఉదారతను చాటుకోవాలని కోరారు. ఈ విరాళాల కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం (శ్రీనివాస రావు పేట మెయిన్ రోడ్డు) లో ఒక డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల ఏడోతేదీ సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.