అమరావతి, మహానాడు: వరదలకు నష్టపోయిన బాధితుల సహాయార్థం పలువురు దాతలు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను గురువారం కలిసి చెక్కులు అందజేశారు. ఆర్టోస్ బెవరేజస్ లిమిటెడ్ (హైదరాబాద్) తరఫున సుంకర అజయ్ రూ.5 లక్షలు, నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ఫరూఖ్ రూ. 3,92,000 లు అందజేశారు. దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.