Mahanaadu-Logo-PNG-Large

15 వరకూ కొండవీడు కోటకు పర్యాటనకు రావొద్దు

– పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు

నరసరావుపేట, మహానాడు: భారీ వర్షాల వల్ల కొండవీడుకోట ఘాటు రోడ్డుపై కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో ఈ నెల 15 వరకూ పర్యాటకులు కోటకు రావొద్దని కలెక్టర్ అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కొండవీడుకోట ఘాటు రోడ్డు, నగరవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. రోడ్లు భవనాల శాఖ అధికారుల సహాయంతో రోడ్ల మీది భారీ బండరాళ్లను తొలగించాలని జిల్లా అటవీ అధికారి రామచంద్రరావును ఆదేశించారు. ఘాటు రోడ్డుపై ప్రయాణాలకు ప్రమాదరహిత స్థాయిలో కొండచరియలు ఉన్నాయని నిశ్చయించుకున్న తర్వాతే పర్యాటకులను అనుమతించాలని ఆదేశించారు.