Mahanaadu-Logo-PNG-Large

కాంగ్రెస్‌ డబ్బు, మద్యం పంచుతున్నా చర్యలు తీసుకోరా?

సీ విజిల్‌కు ఫిర్యాదు చేస్తే దొంగలతో కుమ్మక్కవుతారా?
తక్షణమే నిలువరించకపోతే తమ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు
కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ హెచ్చరిక

కరీంనగర్‌, మహానాడు : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, మందు బాటిల్‌ పంపిణీ చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బరితెగించి బాహాటంగానే డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అం శంపై ‘సీ విజిల్‌’ యాప్‌లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా డబ్బులు పంచుతున్న నేతలకు సమాచారం పంపి సహకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పైసలతో అడ్డదారుల్లో గెలవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున డబ్బులను డంప్‌ చేశారని తెలిపారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, ఇంటికి మందు బాటిల్‌ చొప్పున 15 లక్షల మందికి పంపిణీ చేస్తూ ఓట్లు కొని గెలవాలని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు.

అధికారులు, పోలీసుల సహకారం లేకుండా సాధ్యమా?

అధికారులు, పోలీసుల సహకారం లేకుండా ఇంటింటికీ డబ్బుల పంపిణీ సాధ్యమా? కళ్లముందే డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా ఎన్నికల కమిషన్‌ చోద్యం చూడటం వెనుక మర్మమేంది? అట్లాంటప్పుడు ఎన్నికల కమిషన్‌ ఎందుకు? ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరా రు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న పార్టీలు, నాయకులపై తీవ్రమైన చర్యలు తీసుకోవా లని కోరారు. లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తలే డబ్బులను గుంజుకుని ప్రజలకు పంచే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ప్రజలు డబ్బులకు అమ్ముడు పోయే వాళ్లు కాదనే సంగతిని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.