Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ గెలుపుపై సొంత పార్టీలోనే అనుమానాలు

– టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేత పందెం పదిలక్షలు!
– బెట్టింగులో రెండుగా చీలిపోయిన వైసీపీ నేతలు
– టీడీపీ గెలుస్తుందని రాతపూర్వక పందెం
– జగన్ ఓటమిని ముందే తేల్చేసిన పంచ్ ప్రభాకర్
– జగన్ ఓవర్ యాక్షన్ చేశారని ప్రభాకర్ ‘పంచ్’
– కార్యకర్తలను కలవలేదంటూ మరో పంచ్
– వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లపై ఓటమి ప్రభావం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు మరో రెండురోజులే సమయం ఉంది. ఈలోగా వైసీపీ కార్యకర్తలకు కళ్లు తిరిగే ముందస్తు ఓటమి నిజాలు’, వీడియోల రూపంలో ఎదుర వుతున్నాయి. అసలు సొంత పార్టీ నేతలే తమ పార్టీ గె లవదంటూ బెట్టింగులు కాస్తున్న షాకింగ్ న్యూసులు. నిన్నటి వరకూ అమెరికాలో ఉంటూ జగనన్నను భుజం పుళ్లు పడేలా మోసి, టీడీపీ-జనసేనపై నోరు అలసిపోయేలా తిట్టిపోసిన పశువుల డాక్టర్ పంచ్ ప్రభాకర్ సైతం.. ఇది గెలిచే ముఖం కాదంటూ ముఖం మీదనే తిట్టిన వీడియో.. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు నిరాశ కలిగిస్తున్నాయి. దానితో అసలు కౌంటింగ్‌కు వెళదామా? వద్దా? వెళ్లి గెలిచే కూటమి ఎమ్మెల్యేకు శత్రువు కావడం ఎందుకన్న ఆలోచన మొలకెత్తుతోంది.

ఈ ఎన్నికల్లో అదేం విచిత్రమో గానీ.. వైసీపీ గెలుస్తుందని ఏపీలో ఎవరూ గత ఎన్నికల మాదిరిగా బెట్టింగులు కాయడం లేదు. కానీ కొందరు గ్రామాల్లో మాత్రం ఎవరి స్థాయిలో వారు పందాలు కాస్తున్నారు. అయితే విచిత్రంగా వైసీపీ నేతలే రెండు పార్టీలుగా చీలిపోయి, ఒకరు వైసీపీ గెలుస్తుందని పందెం కాస్తే, మరొకరు టీడీపీ గెలుస్తుందంటూ పందెం కాయడమే ఈ ఎన్నికల్లో వైసీపీలో కనిపించిన స్పెషాలిటీ. వాటికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండటం, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల ఉత్సాహాన్ని నిలువునా నీరుగారుస్తున్నాయట.

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు వైసీపీ గెలుస్తుందని నల్లచెరువు మండల నాయకుడు… గాండ్లపెంట వైసీపీ నాయకుడు మాత్రం టీడీపీ గెలుస్తుందని పందాలు కాశారు. దాని

విలువ అక్షరాలా పదిలక్షలు. అంటే ఇద్దరివీ కలిసి 20 లక్షలన్నమాట. ఆ మేరకు ఇద్దరూ తెల్లకాగితంపై ఒప్పంద పత్రం త యారు చేసుకున్నారు.

ఆ ఒప్పందం వివరాలేమిటంటే… ‘‘ పందెం విలువ పదిలక్షలు. కదిరి అసెంబ్లీ సీటు వైసీపీకే వస్తుందని బి.విశ్వనాధరెడ్డి మరియు బైక్ భాస్కర్‌రెడ్డి.. కానీ టీడీపీ గెలుస్తుందని మంజురెడ్డి (గాండ్లపెంట) చెప్పినాడు. దీనికి పందెం కింద ఒప్పందం చేసుకోవడం జరిగింది. కదిరి వైసీపీ గెలిస్తే డబ్బు మొత్తం 20 లక్షలు, విశ్వనాధరెడ్డి మరియు భాస్కరరెడ్డికి ఇచ్చే విధంగానూ.. అదే కదిరి టీడీపీ గెలిస్తే మొత్తం 20 లక్షలు మంజురెడ్డికి ఇచ్చే విధంగానూ ఏర్పాటు చేశారు. ఇద్దరూ 10 లక్షల రూపాయల చొప్పున కట్టిన పందెం డబ్బును లోకేశ్వర్‌సారు దగ్గర పెట్టడం జరిగింది. దీనితో మెజారిటీకి సంబంధం లేదు. ఓన్లీ గెలుపు మాత్రమే. ఇట్లు బీవీఎన్‌రెడ్డి, మంజురెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి’’ అని రాసుకున్నారు. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తూ.. కౌంటింగ్‌కు వెళుతున్న వైసీపీ ఏజెంట్లను ఆలోచనలో పడేస్తోంది.

‘సొంత పార్టీ వారికే గెలుపుపై నమ్మకం లేకపోతే, ఇక బయట ప్రజల సంగతేంటి?’ అని కొందరు.. వైసీపీ గెలవదని ఆ పార్టీ నాయకుడే డిసైడయి, పది లక్షల పందెం కట్టాడంటే, టీడీపీ గెలుపుపై అతనికి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతోంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. తమ పార్టీ గెలవదని తమ పార్టీ నాయకుడే టీడీపీ పక్షాన పదిలక్షల పందెం కాయడం.. కౌంటింగ్‌లో పాల్గొనే వైసీపీ ఏజెంట్ల కాళ్లకు బ్రేకులు వేస్తున్నాయి. ఎలాగూ సొంత పార్టీ వాళ్లే ్ట వైసీపీ రాదని, టీడీపీ పక్షాన బెట్టింగులు కడుతుంటే.. కౌంటింగ్‌లో అంతసేపు నడుం విరిగేలా కూర్చుని, ఒకవేళ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోతే, గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేతో తిప్పలు ఎందుకని ఆలోచనలో పడిపోతున్నారట.

వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల కాళ్ల బ్రేకులకు మరో వీడియో కూడా కారణంగా మారిందట. ఐదేళ్లపాటు జగనన్నను భుజానికెత్తుకుని.. చంద్రబాబునాయుడు, పవన్, లోకేష్, చివరకు హైకోర్టు జడ్జిలను కూడా బూతులు తిట్టిన జగనన్న వీరాభిమాని పంచ్ ప్రభాకర్ కూడా.. జగన్ ప్రభుత్వం రావడం లేదని తేల్చేయడంతో, కౌంటింగ్‌కు వెళ్లే వైసీపీ ఏజెంట్లు ముందస్తుగా కళ్లు తేల్చేస్తున్నారట. అంతలావు పంచ్‌ప్రభాకర్ సైతం జగన్‌ది ఓవరాక్షన్ అని తేల్చేశారు. పేదరికానికి కులాలేమిటని కడిగేశారు.

‘‘ జగన్మోహన్‌రెడ్డి ఓవరాక్షన్. జనంలో కలియతిరిగి ఒక్కసారి తాడేపల్లిలో కూర్చుని తలుపులేసుకున్నారు. దిసీజ్ నిజం. మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఓవర్‌యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. నువ్వు చేసే పని పదే పదే చెప్పుకుంటే నిన్న పిచ్చి తుగ్లక్ అనుకుంటారు. కార్యకర్తలను పట్టించుకోలేదు. కోటరీని మాతమే దగ్గరకు తీయలేదు. వాళ్లేం చేశారో తెలియదు. నువ్వు పడ్డ కష్టం. నిన్ను అంతకంటే ఎక్కువగా గుండెలో పెట్టుకున్న వారిని పలకరించిన దాఖలాలు లేవే. నువ్వు డబ్బులిచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. నువ్వు ఒక్కడివే సత్యహరిశ్చందుడి టైపులో.. నీ కష్టం, నీ ఫ్యామిలీ ఎవరూ కాదనరు. పేదరికంలో నా బీసీ, నా ఓసీ, నా ఎస్సీ అని ఉండరు. పేదరికానికి కులం ఉండదు. అది ఓవరాక్షనే. జగన్.. నువ్వు గెలవాలనే నా కోరిక. కానీ నిన్ను ఏకిపారేయాలనిలేదు. కానీ నా మనసుమాటలో చెప్పాలనిపించింది’’ అని, ఏకనంటూనే జగనన్న తీరును ఏకిపారేశారు.

ఈ రెండు ఘటనలు రహస్యంగా జరిగినవి కాదు. సోషల్‌మీడియాలో ప్రజలు చూస్తున్నవే. ఇవే ఇప్పుడు వైసీపీ కోసం, కౌంటింగ్ ఏజెంట్లుగా వెళుతున్న వారి కాళ్లకు బ్రేకులు వేయడానికి కారణాలట.