యూపీ: పీకలదాకా తాగిన ఓ వ్యక్తి రైల్వే పట్టాల మధ్యలో నిద్రపోయాడు. అదే ట్రాక్‌లో రైలు వెళ్లినా చలించలేదు. అతడిని గమనించిన లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సమయానికి అతను ఇంకా నిద్రిస్తూనే ఉండటం, గాయాలు కాకపోవడంతో పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.