అప్పటి కరెంట్ కోతలు గుర్తులేదా?
పార్టీ కరపత్రంలో సిగ్గులేకుండా దుష్ప్రచారమా..
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి మండిపాటు
హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్ నేతలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి ఫైర్ అయ్యారు. గాంధీ భవన్‌లో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా గగ్గోలు పెడుతున్నారు. ఆ పార్టీ కరపత్రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాస్తున్నాఃరు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరెంటు కోత లు అని రాస్తున్నారు. వాస్తవమే కరెంటు అంతరాయంతో కొద్దిసేపు ఆగింది. కేసీఆర్ పాలనలో కరెంటు పోయి రోగుల ఊపిరే ఆగింది. రోగుల మీద ఎలు కలు దండయాత్రలు జరిగాయి. ఇవి మీ కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించా రు. ఈరోజు బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ దోచు కుందామా అనే సోయి తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిప డ్డారు. చిన్నచిన్న సంఘటనలను భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు.