ఐదేళ్ళ వైసీపీ పాలనలో గ్రావెల్ తో రూ. కోట్లు గడించారు…

– సవాల్‌కు సిద్ధమై బోసుబొమ్మ కూడలికి వెళ్ళిన ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, మహానాడు: ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి కోట్లాది రూపాయలు గడించారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు ప్రత్యర్థులు విసిరిన సవాల్‌ను స్వీకరించి తిరువూరు బోసుబొమ్మ కూడలికి శనివారం ఉదయం వెళ్ళారు. అక్కడి మీడియాతో మాట్లాడారు. అక్రమమట్టి తవ్వకాలంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు.. తిరువూరు నియోజకవర్గంలో ఖనిజ సంపద ఉంది.. దీనిపై వైసీపీ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు కన్నేశారు.

వైసీపీ పాలన దోపిడీపై సాక్షాలతో నిరూపిస్తాను. మా రెండునెలల పాలనలో ప్రజా అవసరాలకు మాత్రమే పారదర్శకతతో అనుమతులు ఇస్తున్నాం.. అనుమతులు లేకుండా ఇసుక తరలించిన 40 ట్రాక్టర్ లను నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు చట్టపరంగా సీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా మట్టి తరలించిన ప్రదేశాల్లో పాత ఫోటోలను ప్రచురించి తప్పుడు కథనాలు అల్లుతున్నారు. ఎప్పుడైనా చర్చకు సిద్ధమే, మీ వైసీపీ పార్టీ సిద్ధమా? అని మీడియా ముఖంగా ఎమ్మెల్యే ప్రశ్నించారు. సొంత పట్టాభూమి కలిగిన యజమాని అనుమతులతో తన వెంచర్ కు గ్రావెల్ తరలించుకున్నారు. పట్టణ అభివృద్దే తన ప్రాధాన్యం… ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడు ముందుంటాను. అసత్య కథనాలు ప్రచురిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైసీపీ నాయకులకు సవాల్ చేస్తున్న మీరు ఇక్కడికి రాలేదు…. మీరు చెప్పండి చర్చకు నేను వస్తా ప్లేస్, టైమ్ చెప్పండి నేను చర్చకు వస్తా అని వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరిగి సవాల్ విసిరారు.