Mahanaadu-Logo-PNG-Large

అంకితభావంతో ప్రజల మన్ననలు పొందండి

క్షేత్రస్థాయిలో అధ్యయనంతో పరిష్కార మార్గం
ట్రైనీ ఐఏఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్‌: వృత్తిలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు కలిశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ వారిని పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న అధికారులకు కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో వారు నిర్వహించిన విధుల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రజలకు సేవతోనే గుర్తింపు దక్కుతుందన్నారు. శిక్షణలో ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లిలోతుగా అధ్యయనం చేయడం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం తెలుసుకున్న అంశాలను పరిపాలనలో తీసుకునే నిర్ణయాలతో పరిష్కరించడం సులువు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, ఐఏఎస్‌ కోర్సు డైరెక్టర్‌ ఉషారాణి, నోడల్‌ అధికారి పెద్దబోయిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.