– పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
కోనూరు, మహానాడు: అచ్చంపేట మండలం కోనూరులో 85 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను పెదకూరపాడు శాసన సభ్యుడు భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. కోనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు 85 లక్షల రూపాయలతో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం,ఇంటింటికి కుళాయిలను నూతనంగా ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్,ఇంటింటికి కుళాయిలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారులు, స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నీటి సమస్యతో కోనూరు గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కోనూరు గ్రామ ప్రజల నీటి సమస్య పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 85 లక్షల రూపాయల నిధులతో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చిత్త శుద్ధితో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికంగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.