దీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య

– టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ 

దర్శి, మహానాడు: దీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య అని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏక లవ్య జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా  పాల్గొన్నాఋ. ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి, కేకు కట్ చేసి  నివాళులర్పించారు.

ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ….   ఏకలవ్య ద్రోణాచార్యుని దగ్గర చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. రాజ్య చట్టానికి కట్టుబడ్డ ద్రోణాచార్య అతన్ని తన శిష్యునిగా అంగీకరించలేక పోయాడు.దీంతో ఏకలవ్య తన హృదయంలో ద్రోణాచార్యుడిని తన గురువుగా విగ్రహాన్ని తయారు చేసుకొని సాధన చేశాడు. ఆనతి కాలంలోనే చిత్తశుద్ధి, అభ్యాసంతో విలువిద్యను నేర్చుకున్నాడు. తిరుగులేని విలుకాడు గా పేరు తెచ్చుకున్నాడు.

ద్రోణాచార్యుడు ‘ఏక్లలవ్యా, నువ్వు నాకు కొంత గురుదక్షిణ ఇవ్వాలి. నీ కుడిచేతి బొటనవేలు నాకు ఇవ్వాలి’ అని కోరాడు. బొటనవేలు లేకుండా విలువిద్య సాధన సాధ్యం కాదని ఏకలవ్యకు తెలుసు. అయినా ఏకలవ్య రెండో ఆలోచన లేకుండా తన కుడి చేతి బొటన వేలిని తన గురువుకు దక్షిణగా ఇచ్చాడు. అలాంటి నిస్వార్థమైన ఏకలవ్య ను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  మాజీ శాసనసభ్యులు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎస్సీ నాయకులు ప్రేమ్ కుమార్, తెదేపా నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.