Mahanaadu-Logo-PNG-Large

జగన్‌ను ముంచిన ఉద్యోగులు

ప్రతి పార్టీ కి ఒక సొంత ఓటు బ్యాంక్ వుంటుంది. అది ఎప్పటికీ మారదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 40 శాతం, తెలుగుదేశంకు 40 శాతం వుంటుంది. ఎవరు ఎన్ని ఉచితాలు ఇచ్చిన వీరిలో మార్పు రాదు. మిగిలిన 20 శాతం మారుతూ ఉంటుంది .ఈ 20 శాతం పార్టీ విజయంను నిర్దేశిస్తుంది.

ఈ 20 శాతం లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తారు.ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పొరపాటు చేసింది. సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కలిపితే 20 లక్షలు పైగా ఉంటారు. అటువంటి వారిని పట్టించుకోకుండా వారికి రావలసిన ఆర్ధికం లు రెండు మూడు సంవత్సరాలు పెండింగ్ లో పెట్టడం అడిగితే అరెస్టు లు బెదిరించడం చేయటం వలన ఈ పరిస్థితి తలెత్తింది.

ప్రతి ఉద్యోగి కీ కుటుంబం, బంధువులు వుంటారు. అనే విషయం పాలకులు గుర్తించ లేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ లు పూర్తిగా ఏకపక్షంగా పడటం వలనకూడా ఓటర్లు ఆలోచించారు. అందువల్ల విజయం ఏకపక్షంగా ఏర్పడింది.

– బాలు