– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు. 29 న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్ లోగో ఆవిష్కరించాం… ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆలోచన… ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.. రాష్ట్రం భవిష్యత్ లో క్రీడా రంగంలో నంబర్ 1 ఉండాలి.. క్రీడా రంగంలో భవిష్యత్ లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రయత్నం లో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారు.. అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యం… పిల్లలను ప్రోత్సహించాలి.. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారు.
స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతుంది.. కరీంనగర్ లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉంది.. స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలి.. కాగా, నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను కూడా స్పీకర్, మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.