– ‘వారధి’లో ఫిర్యాదు
విజయవాడ, మహానాడు: ఒంగోలు అసెంబ్లీ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి, సుమారు రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘వారధి’కి వైసీ యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ దందా అప్పటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కనుసన్నుల్లో జరిగిందని, అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, తూతూ మంత్రంగా విచారణ జరిపి అసలు నేరస్తులను వదిలేసి చిన్న వారిమీద కేసులు పెట్టి చేతులు దులుపుకొందని ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ‘వారధి’ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రారంభించిన విషయం విదితమే. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వం ఈ దందాలో కీలక పాత్రదారులను రక్షించిందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాదవ్ వారిని కోరారు.